9 కేటగిరీలోని బయాస్‌లు

మనకు పరిచయమైన లేదా ఇష్టమైన విషయాలను, వ్యక్తులను మెరుగైనవిగా మనం ఊహిస్తాం

లోతైన విశ్లేషణ

అన్ని బయాస్‌లు

అవుట్-గ్రూప్ హోమోజెనిటీ బయాస్
మన వాళ్ళందరూ తలో రకంగా ఉన్నా, పరాయి వాళ్ళంతా ఒక్కటే రకం అని అనుకుంటాం.
క్రాస్-రేస్ ఎఫెక్ట్
మన జాతీయుల ముఖాలను సులభంగానే గుర్తుపట్టగలం కానీ, ఇతర జాతీయుల ముఖాలను అంత తేలికగా గుర్తించలేం.
ఇన్-గ్రూప్ బయాస్
వేరే వాళ్లెంత ప్రతిభావంతులైనా సరే, మనవాళ్లంటేనే మనకు ఎక్కువ మక్కువ, పక్షపాతం.
హాలో ఎఫెక్ట్
ఒకరిలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని చూసి, వారిలో అన్నీ మంచి లక్షణాలే ఉంటాయని ఒక పాజిటివ్ ముద్ర వేసుకుంటాం.
చీర్‌లీడర్ ఎఫెక్ట్
విడిగా చూసినప్పటికంటే, పదిమందితో కలిసి గుంపుగా ఉన్నప్పుడే జనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.
పాజిటివిటీ ఎఫెక్ట్
వయసు పెరిగే కొద్దీ గతాన్ని తలుచుకున్నప్పుడు, చేదు సంఘటనల కంటే తీపి జ్ఞాపకాలే ఎక్కువగా గుర్తొస్తాయి.
నాట్ ఇన్వెంటెడ్ హియర్
మనవి కానంత మాత్రాన బయట వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే అద్భుతమైన ఐడియాలను కూడా అంగీకరించం.
రియాక్టివ్ డివాల్యుయేషన్
ఒక సలహా ఎంత అద్భుతంగా ఉన్నా సరే, అది మన శత్రువు చెప్పాడంటే చాలు దాన్ని పనికిమాలినదిగా తీసిపారేస్తాం.
వెల్-ట్రావెల్డ్ రోడ్ ఎఫెక్ట్
రోజూ వెళ్లే దారైతే ఇట్టే వెళ్ళిపోతామని, అదే కొత్త దారైతే చాలా సమయం పడుతుందని అంచనా వేస్తాం.